Cine Out Look

News

బిచ్చగాడు హీరోయిన్ సీక్రెట్ పెళ్లి

  బిచ్చగాడు హీరోయిన్ సీక్రెట్ పెళ్లి

బిచ్చగాడు(పిచ్చైక్కారన్) సినిమా ఎంత ఘన విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హీరోయిన్ 'సాట్నా టైటస్' రహస్య వివాహం చేసుకుంది. ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తికీ నటి సాట్నాకు మధ్య ప్రేమ చిగురించి అది పెళ్ళికి దారితీసింది. నెల రోజుల ముందే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం కాస్త ఆలస్యంగా బయట పడింది. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎక్కడా బయిటపొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి నానా యాగి చేస్తోంది. తన కూతురుని మోసం చేశారని మాయమాటలు చెప్పి నమ్మించారని ఆమె తల్లి నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. నటి సాట్నా తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని, కార్తీ తన కూతురిని మాయలో పడేశారని, అతని నుంచి సాట్నాను విడిపించాల్సిందిగా నడిగర్ సంఘాన్ని ఆశ్రయింయించింది. 

Read Full Article

హీటెక్కిస్తున్న ‘ఈషా'

  హీటెక్కిస్తున్న ‘ఈషా'

బాలీవుడ్ లో సంచలనాలను సాధిస్తూ పోతోంది హీరోయిన్ ఈషాగుప్తా. థ్రిల్లర్ సినిమా ‘రుస్తుం’తో మంచి పేరునే సంపాదించింది ఈ అమ్మడు. అంతేకాదు పబ్లిసిటీ పెంచుకోవడంలో చాలా ముందు ఉంటుంది ఈషా. ప్రస్తుతం ఆమె చేతుల్లో మూడు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఎప్పుడు మత్తెక్కించే అందాలతో కనువుండు చేస్తూ ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో చూస్తే మతి పోతుంది. చిన్న బ్రా వేసుకుని… మేడలో వెరైటీ డాలర్స్ వేసుకుని తెగ హీటెక్కిస్తోంది అమ్మడు.

Read Full Article

రాధికా ఆప్టే ‘పర్చేడ్’ ట్రైలర్ అదుర్ష్

  రాధికా ఆప్టే ‘పర్చేడ్’ ట్రైలర్ అదుర్ష్

'పర్చేడ్' సినిమా శృంగార సన్నివేశాలతో ద్వారా ఈమధ్య బాగా పాపులర్ అయిన నటి రాధికా ఆప్టే. ఆదిల్ హుస్సేన్, రాధికాకి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు నెట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ నిర్మాత అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. తల్లి, భార్య, కూతురు, వేశ్య ఇలా నలుగురు జీవితాల ఇతివృత్తంతో ఈ సినిమా సాగనుంది. లీనా యాదవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read Full Article

నాగబాబు కుమార్తెకు ‘మొదటి పెళ్లిచూపులు’

  నాగబాబు కుమార్తెకు ‘మొదటి పెళ్లిచూపులు’

నాగబాబు కుమార్తె నిహారికకు మొదటి పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. 'ఒక మనసు' ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆశించిన ఫలితం ఆ సినిమా ఇవ్వలేదు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రెండో సినిమా ఉంటుందని అనుకున్నా అది జరగలేదు. తాజాగా సొంత బేనర్ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ లో రెండో వెబ్ సిరీస్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటిచారు. ‘మొదటి పెళ్లి చూపులు' అనే టైటిల్‌తో రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా నిహారిక పంచుకుంది. హరీష్‌ నాగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నిహారిక 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. తరువాతనే ఈటీవీ 'డీ' వంటి వాటితో తెరపైకి వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే బేనర్ లో వచ్చిన 'ముద్దపప్పు ఆవకాయ్' పరిమితమైన ఎపిసోడ్లతో దీన్ని ముగించడంతో చాలా మంది నిరాశ పడ్డారు. ఇప్పుడు మరోసారి అలరించనుంది నిహారిక. 

Read Full Article

హాలిడే టూర్ కు ఎన్టీఅర్ ఫ్యామిలీ

  హాలిడే టూర్ కు ఎన్టీఅర్ ఫ్యామిలీ

ఎన్టీఅర్ ఫ్యామిలీ కొడుకుతో కలిసి ఓ నెలరోజులు ఫారిన్ ట్రిప్ కు వెళ్లనున్నారు. జనతాగ్యారేజ్ మంచి అందించడంతో.. ఇక కొంతకాలం భార్యా పిల్లలతో హాయిగా గడపాలని అనుకుంటున్నాడట. కొడుకు పుట్టిన తరువాత ఎక్కడికీ వెళ్ళని జూనియర్ తన భార్య కోరిక మేరకు ఒక నెలపాటు అయినా టూర్ వెళ్ళాలని అనుకుంటున్నారట. ఇదే నిజం అయితే జనవరిలో కానీ జూనియర్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. కాగా, ఎవరితో కొత్త సినిమా చేస్తారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అనిల్ రావిపూడి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి.. అది విని నచ్చితే తప్ప ఆయనతో సినిమా ఉండే అవకాశం లేదు. లేకపోతే వేరే ప్రాజెక్టు అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించాలనే ఆలోచనతో ఉన్నాడట. అనిల్ రావిపూడి సినిమా అయితే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది. 

Read Full Article

వావ్ వాణీకపూర్‌ లిప్‌లాక్‌..!

    వావ్ వాణీకపూర్‌ లిప్‌లాక్‌..!

ప్రతి సినిమాలో లిప్‌లాక్‌ అన్నది సర్వ సాధారణం అయిపొయింది. బాలీవుడ్ సినిమాల్లో అవి లేనిదే జనాలు సినిమాలు కూడా చూడలేనంత ఇది అయిపొయింది. హీరోలు తాము ముద్దులతో ఎంతగా హీటేక్కించామో ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు ఫోటోలను వదులుతున్నారు. బాలీవుడ్‌ సినిమా ‘బేఫికర్‌’లో రణ్‌వీర్‌సింగ్‌, వాణీకపూర్‌ లిప్‌లాక్‌ ఫోటోలను ప్రతినెలా తొమ్మిదో తారీఖున ఠంచనుగా పోస్టర్‌ విడుదలైపోతోంది. తాజా పోస్టర్ లో కూడా సెమ్ లిప్‌లాక్‌ ఫొటో రణ్‌వీర్‌ తన ట్విట్టర్‌  ద్వారా విడుదల చేశాడు. ఇప్పటివరకు వదిలిన అన్ని పోస్టర్లలోనూ లిప్‌లాక్‌ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. 

Read Full Article

సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం

  సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016 సంవత్సరానికిగాను శ్రీ కృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనులపండువగా జరిగింది. డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ సాహితీవేత్త, డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ నటి జయప్రద, కన్నడ సాహితీ దిగ్గజం డా.బరగూరు రామచంద్రప్పలకు శ్రీకృష్ణదేవరాయల పురస్కారాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రదానం చేసి అభినందించారు. 

పురస్కారాలు అందుకున్న తర్వాత డా. యార్లగడ్డ మాట్లాడుతూ - ''తెలుగోడి గొప్పదనాన్ని కవితారూపంలో అభివర్ణించారు. కర్ణాటకాంధ్ర మహాప్రభు రాయల పేరిట పురస్కారాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. మా ఆదికవి నన్నయ్య కన్నడిగుడు. మీ హంపా మా తెలుగువాడు అంటూ ఆయన సభికులనుద్దేశించి అన్నారు. కర్ణాటకలో భాషా అల్ప సంఖ్యాకులుగా ఉన్న తెలుగు ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

డా. జయప్రద తెలుగు, కన్నడ భాషలను మిళితం చేసి ప్రసంగించారు. మరో జన్మంటూ ఉంటే కళాకారిణిగానే పుడతానన్నారు. తాను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా కర్ణాటక మెట్టినిల్లు అన్నారు. కన్నడ సాహితీదిగ్గజం డా. బరగూరు రామచంద్రప్ప మాట్లాడుతూ - ''సమాఖ్య వ్యవస్థలో అన్ని భాషల ప్రజలు సామరస్యంగా ఎలా జీవించాలో తెలుగు, కన్నడిగులు చాటి చెబుతున్నారంటూ ప్రశంసించారు. దేశం మొత్తానికి ఇది ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షించారు.

 డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ - ''తన మాతృభాష తెలుగు అయినా జీవన భాష కన్నడ అని గర్వంగా చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల పేరిట తెలుగు, కన్నడ భాషలలో ఓ సీరియల్‌ నిర్మించాలన్న ఆలోచన ఉందన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డా.ఎ.రాధాకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జయచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్‌, కళాబంధు డా. టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

ఏడుపు ఆపుకున్న జూనియర్

  ఏడుపు ఆపుకున్న జూనియర్

 కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వచ్చిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపడంతో హైదరాబాద్‌ జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా జూనియర్ మాట్లాడుతూ... నాకు ఒక వెలుగు కనిపిస్తుందని.... ఆ వెలుగు జనతాగ్యారేజ్‌ అని తెలుస్తుంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాలుగు రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపై, ఈ కథపై పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే లోపల చాలా బాధ పడిపోయాను అని అన్నారు. కానీ అదే రోజుల అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా,ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. జనతాగ్యారేజ్‌ వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషం, నా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చినవాడినయ్యాను అన్నారు ఎన్టీఆర్. 

ఒకవైపు ఆనందంతో వచ్చే ఏడుపును ఆపుకుంటున్నాను. అభిమానులను సంతోషపరచడానికే నేను ఇక్కడ ఉన్నాను. జనతాగ్యారేజ్‌ విజయం కొత్త ఊపిరిని, కొత్త ఆనందాన్నిచ్చింది. బ్రతికినంత కాలం అభిమానుల ప్రేమను, అప్యాయతను పొందాలనే కోరుకుంటున్నాను. ఇంత పెద్ద విజయంలో భాగమైన నటీనటులకు, టెక్నిషియన్స్‌ థాంక్స్‌. జనతాగ్యారేజ్‌ అని ఏరోజైతే టైటిల్‌ పెట్టుకున్నామో ఆరోజు ప్రజలు మమ్మల్మి గుండెల్లో పెట్టుకుని తలెత్తుకునేలా చేశారు అని ఎన్టీఆర్ తెలిపారు.

Read Full Article

కొరటాల డిమాండ్ చూశారా..?

   కొరటాల డిమాండ్ చూశారా..?

పోసాని కృష్ణ మురళి స్కూల్ నుంచి వచ్చి తీసింది మూడే సినిమాలు అయినా కానీ అన్ని బ్లాకు బాస్టర్లు వచ్చాయి. అంతేనా 100కోట్ల వసూళ్లు దాటాయి. ప్రభాష్ 'మిర్చి', మహేష్ బాబు 'శ్రీమంతుడు', జూనియర్ ఎన్టీఅర్ 'జనతాగారేజ్' వంటి సూపర్ సక్సెస్ సినిమాలు రావడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ డిమాండ్ ఎక్కువ చేస్తున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను కొరటాల శివ ఆచరిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 'జనతా గ్యారేజ్' విజయంతో గ్రాఫ్ మరింత పెరిగింది కొరటాలకు. ఇప్పుడు తాజాగా మహేష్ తో మరో సినిమా చేస్తున్న కొరటాల రెమ్యూనరేషన్ రూ .15 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నా 20 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

Read Full Article

ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్

  ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా మహేష్

మురుగుదాష్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ అధికారి పాత్ర పోసిస్తున్నాడట. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రేమికుడిగా పోలీస్ ఆఫీసర్ గా మెప్పించానున్నాడు. ఒక సాధారణ పోలీస్ అధికారి నుంచి ఇంటెలిజెన్స్ స్తాయికి ఎలా ఎదిగాడు అన్నది ఇతివృత్తం కానుందట. తొలిసారిగా మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత  S.J సూర్య దర్శకత్వంలో మరో సినిమా రానుంది. ఇప్పటికే అన్ని ఫైనల్ అయ్యాయి. 

Read Full Article

శాతకర్ణి 'శ్రేయ' ఫస్ట్ లుక్

  శాతకర్ణి 'శ్రేయ' ఫస్ట్ లుక్

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలయ్య, శ్రేయ జంటగా రూపొందుతోన్న చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమాకు సంభందించి శ్రేయ లుక్ ని ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రేయ వశిష్టి దేవి పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాక, ఇంగ్లీష్, కన్నడ చిత్రాల్లో కూడా నటించిన శ్రేయకు... టాలీవుడ్‌లో అగ్రహీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా... సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఇవే ఆమెకు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'శివాజీ' సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా 'మనం'లో నాగార్జున సరసన గ్రామీణ యువతిగా నటించి మెప్పించింది. 

Read Full Article

రాగం క్లాసు... పాట మాసు..!

  రాగం క్లాసు... పాట మాసు..!

Applauz ప్రొడక్షన్స్ వారు డల్లాస్ లో వీరు ముగ్గురితో మ్యూజికల్ షో ఏర్పాటు చేశారు. పార్థసారధి... మల్లిఖార్జున.. గోపికా పూర్ణిమా. అంతేనా ఎందరో మహాను భావులు అందరికీ వందనములు అంటున్నారు గోపికా పూర్ణిమా. అంతేనా మామా ఇక్కడ గాబరగీబర అంటున్నాడు మల్లి. అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..? "Paata మాస్ Raagam క్లాస్" ఒక సంగీత కచేరీ సెప్టెంబర్ 9, 2016న సాయంత్రం 7:00 PMకు జరగనుంది. ప్రముఖ సినీ నటుడు, కవి మరియు సాహితీ ప్రేమికుడు తనికెళ్ళ భరణి సాహిత్య అనుభవాలు కూడా ఇక్కడ చోటు చెసుకొనున్నాయి. ఈ ముగ్గురు గాయకులు కూడా పాడుతాతీయగా నుంచి వచ్చిన వారే.

టికెట్స్ మిగతా డీటెయిల్స్ కోసం...
Tickets can be purchased online via MyDealsHub or Eknazar or Desiplaza
Or for more details visit - www.facebook.com/ApplauzProductions
please visit http://lotusfoundationusa.org

Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !