Cine Out Look

Review

సినిమా రివ్యూ: జనతా గ్యారేజ్‌

సినిమా రివ్యూ: జనతా గ్యారేజ్‌
Movie Title
మోహన్‌లాల్‌, ఎన్టీఆర్‌, సమంత, నిత్య మీనన్‌, ఉన్ని ముకుందన్‌, సాయికుమార్‌
Star Cast
కొరటాల శివ
Director
నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)
Producer
దేవి శ్రీ ప్రసాద్‌
Music Director
సెప్టెంబరు 1, 2016
Release Date
2.5 out of 5
Rating: 2.5
Cineout Look Rating 2.5

About Movie

చిన్న సినిమాలు కంటెంట్‌ని న‌మ్ముకొని వ‌స్తున్నాయి. పెద్ద సినిమాలు స్టార్ బ‌లాన్ని న‌మ్ముకొని త‌యార‌వుతున్నాయి. స్టార్లు.. క‌థ‌ల్నీ కంటెంట్‌నీ న‌మ్ముకొంటే ఎలా ఉంటుందో శ్రీ‌మంతుడు రుచి చూపించింది. శ్రీ‌మంతుడు గొప్ప కథేం కాదు. కానీ.. అందులో  విలువైన కంటెంట్ ఉంది. ఊరు ఉంది. మ‌నవైన విలువ‌లున్నాయి. ఓ మంచి మాట ఉంది. జ‌న‌తా గ్యారేజ్ క‌థ‌నీ అదే సూత్రంతో అల్లుకొని ఉంటాడు కొర‌టాల శివ‌. ఇద్దరు మంచి మ‌నుషులు.. ఒక‌రికి మొక్కలంటే ప్రాణం, ఇంకొక‌రికి మ‌నుషులంటే ప్రాణం. ఇద్దరూ క‌లిస్తే ఎంత బాగుంటుందో చూపిద్దామ‌నుకొని ఉంటాడు. అందుకే.. జన‌తా గ్యారేజ్ అనే సినిమా తీశారు. ఎన్టీఆర్ హీరో అవ్వడం.. శ్రీ‌మంతుడు తర‌వాత కొర‌టాల టేక‌ప్ చేసిన సినిమా కావ‌డంతో.. జ‌న‌త‌పై అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి.. దాన్ని అందుకొందా, లేదా?  ఎన్టీఆర్ హ్యాట్రిక్‌కొట్టాడా, కొర‌టాల వ‌రుస‌గా మూడో విజ‌యం సాధించాడా?  

Story
హైద‌రాబాద్‌లో స‌త్యం (మోహ‌న్‌లాల్‌) జ‌న‌తా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్డుని న‌డుపుతుంటాడు. త‌న ద‌గ్గర‌కు ఎవ‌రైనా స‌మ‌స్యంటూ వ‌స్తే... త‌న సైన్యంతో వెళ్లి ప‌రష్కరిస్తాడు. దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు. స‌త్యం త‌మ్ముడు (రెహ‌మాన్‌)ని శ‌త్రువులు చంపేస్తారు. త‌మ్ముడి వార‌సుడు ఆనంద్ (ఎన్టీఆర్‌)ని ముంబై పంపించేస్తాడు స‌త్యం. హైద‌రాబాద్‌లో పెద‌నాన్న ఉన్నార‌ని, త‌న‌కో కుటుంబం ఉంద‌ని కూడా తెలియ‌కుండానే ముంబైలో పెరిగి పెద్దవాడ‌వుతాడు ఆనంద్‌. త‌న‌కి మొక్కలంటే ప్రాణం. ప‌ర్యావ‌ర‌ణాన్నికాపాడుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతుంటాడు. మ‌ర‌ద‌లు బుజ్జి (స‌మంత‌) అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకొంటారు. మేన‌మామ (సురేష్‌) కూడా ఇద్దరికీ పెళ్లి చేయాల‌నుకొంటాడు. త‌న ప్రాజెక్ట్ ప‌ని నిమిత్తం హైద‌రాబాద్ వ‌స్తాడు ఆనంద్‌. ఇక్కడ చిన్నా (ఉన్నిముకుంద‌న్‌)తో గొడ‌వ పెట్టుకొంటాడు. చిన్నా ఎవ‌రో కాదు.... స‌త్యం త‌న‌యుడే.  అప్పుడేమైంది?   స‌త్యం, ఆనంద్ ఎప్పుడు క‌లుసుకొన్నారు?  జ‌న‌తా గ్యారేజ్ ని ఆనంద్ ముందుండి ఎలా న‌డిపించాడు?  అనేదే మిగిలిన క‌థ‌.

Analysis

న‌టీన‌టుల పనితీరు :

ఎన్టీఆర్ ఎప్పట్లా... క‌ష్టప‌డ్డాడు. డాన్సుల్లో, ఫైటుల్లో త‌న టాలెంట్ అంతా చూపించాడు. ఎమోష‌న్ సీన్ల ద‌గ్గర ఫుల్లుగా మార్కులు ప‌డ‌తాయి. స‌మంత‌కి దూర‌మ‌య్యేట‌ప్పుడు త‌న న‌ట‌న బాగుంది. మోహ‌న్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమంది? ఆయ‌న త‌న పాత్ర ప‌రిధి మేర‌కు అద్భుతంగా న‌టించారు. స‌మంత‌, నిత్యల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ఇద్దరివీ గెస్ట్ రోల్సే అనుకోవాలి. సాయికుమార్‌, బ్రహ్మాజీ, అజ‌య్‌... రాణించారు. ముకుంద్ పాత్ర అంతంత మాత్రమే. విల‌న్ వీక్ అయిపోవ‌డం ఈ సినిమాకి పెద్ద మైన‌స్‌.

సాంకేతికంగా వర్గం పనితీరు:

దేవిశ్రీ బాణీలు రొటీన్‌గానే సాగాయి. టైటిల్ సాంగ్ ఒక‌టి హుషారుగా ఉంది. పక్కా లోక‌ల్ మాస్‌కి న‌చ్చే బాణీనే. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా బాగా గ్రాండ్‌గా ఉంది. జ‌న‌తా గ్యారేజ్ సెట్ కోసం రూ.5 కోట్లు ఖ‌ర్చు పెట్టాం అన్నారు. కానీ.. అంతెందుకు అనిపించేలా ఉంది ఆ సెట్టు. కొర‌టాల శివ ర‌చ‌యిత‌గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే డైలాగుల్లో త‌న ఛ‌మ‌క్ క‌నిపించ‌లేదు. ఆ ప్రభావం డైరెక్టర్ మీదా ప‌డుంటుంది. దాంతో.. ఈసారి ట్రాక్ త‌ప్పాడు.

విశ్లేష‌ణ‌

మిర్చి, శ్రీ‌మంతుడు సినిమాల్లోనూ గొప్ప క‌థ‌లుండ‌వు. కానీ ఎమోష‌న్‌పై న‌డిచిపోయాయి. అయితే ఈ సినిమాలో క‌థా లేదు. ఎమోష‌న్ కూడా లేదు. ఓ మంచోడు.. ప్రజ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాడు. అది.. కొంత‌మంది పెద్దల‌కు న‌చ్చదు. దాంతో.. ఆ పెద్ద‌లు, ఈ మంచోడు మ‌ధ్య పోరాటం జ‌రుగుతుంది. చివ‌రికి మంచోడే గెలుస్తాడు.. ఇదీ స్థూలంగా జ‌న‌తా గ్యారేజ్‌క‌థ‌. ఇక్కడ మంచోడు అంటే.. జ‌న‌తా గ్యారేజ్ అని అర్థం. ఈ గ్యారేజ్‌లో ఏడుగురు ఉంటారు. దానికి లీడ‌ర్ హీరో అనుకోవాలి. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా హీరో పాత్రని డిజైన్ చేశారు. మొక్కల్ని సంరక్షించ‌డం ఓ గొప్ప బాధ్యత‌గా గుర్తించాల్సిన ఈ త‌రుణంలో క‌థానాయ‌కుడి పాత్రని ఇలా డిజైన్ చేసినందుకు ద‌ర్శకుడ్ని అభినందించాల్సిందే. కాక‌పోతే... ఆ మొక్కల‌కూ ఈ గ్యారేజ్ క‌థ‌కూ సంబంధం ఉండదు. హీరో మొక్కల్ని, ప‌ర్యావ‌ర‌ణాన్నీసంర‌క్షించేవాడే కాన‌క్కర్లెద్దు ఈ క‌థ‌లో. శ్రీ‌మంతుడు సినిమా ఊరి ద‌త్తత నేప‌థ్యంలోనే న‌డుస్తుంది. ఆ క‌థ‌కు ప్రాణం అదే. ఇక్కడ మాత్రం ప‌ర్యావ‌ర‌ణం అనే కాన్సెప్ట్ హీరో పాత్ర చిత్రణ వ‌ర‌కు మాత్రమే ప‌రిమితం చేశారు.

ఏ క‌థ‌కైనా ఎమోష‌న్ పండ‌డం చాలా ముఖ్యం. స‌న్నివేశాల్ని న‌డిపించేది ఆ ఎమోష‌నే. కానీజ‌న‌తాలో అంత‌గా ఎమోష‌న్‌పండించే స‌న్నివేశాలేం లేవు. మోహ‌న్‌లాల్ వ‌చ్చి ఎన్టీఆర్‌ని జ‌న‌తా గ్యారేజ్‌లోకి ర‌మ్మని ఆహ్వానిస్తాడు.. ఎన్టీఆర్ వెళ్లిపోతాడు. కానీ అలా ఆహ్వానించ‌డానికి బ‌ల‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగి ఉంటే బాగుండేది. కథేంటన్నది తొలి ప‌ది నిమిషాల్లోనే తేలిపోతుంది. ఆ త‌ర‌వాత ఏం జ‌రుగుతుందనేది ప్రేక్షకుడు ఊహ‌కు అంద‌ని అద్భుత‌మేమీ కాదు,  ఏమీ లేని చోట ద‌ర్శకుడు ఏదేదో చేద్దామ‌ని సీన్‌ని లాగి లాగి లాగ్ చేశాడు. నిజంగా ఏదైనా చూపిస్తాడేమో అన్నచోట తుస్ మ‌నిపించాడు. గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగి (రాజీవ్ క‌న‌కాల‌) కోసం చేసే ఫైటు, అక్కడ ప‌లికిన సంభాష‌ణ‌లే కాస్త బాగున్నట్టు అనిపిస్తాయి. అలాంటి స‌న్నివేశాలు క‌నీసం అర‌డ‌జ‌ను అయినా ప‌డుండాల్సిందే. ఫ‌స్టాఫ్‌లో మోహ‌న్ లాల్ హీరో. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ హీరో. సెకండాఫ్‌లోనూ మోహ‌న్ లాల్‌కి కొన్ని సీన్లు ప‌డుంటే ఎన్టీఆర్ సైడ్ అయిపోయిన‌ట్టు అనిపిస్తుంద‌నుకొన్నారేమో, సెకండాఫ్‌లో మోహ‌న్‌లాల్‌నే సైడ్ చేసేశారు. హీరోయిన్లు ఇద్దరున్నా.. దాదాపుగా ఇద్దరివీ గెస్ట్ రోల్సే. ప‌తాక స‌న్నివేశాలు ప‌ర‌మ వీక్‌. సినిమా అంతా సీరియ‌స్ గా సాగుతుంది. వినోదం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌. ఎన్టీఆర్ అభిమాని అయ్యిండి.. శ్రీ‌మంతుడు హ్యాంగోవ‌ర్‌లో ఉండుండే... జ‌న‌తా గ్యారేజ్ చూడాల్సిందే. కానీ.. భారీ అంచ‌నాల‌తో వెళ్తే మాత్రం నిరాశ ప‌డ‌తారు.

Plus Points

  • ఎన్టీఆర్ నటన ,
  • ఎన్టీఆర్-మోహన్ లాల్ సీన్స్ 
  • పక్క లోకల్ సాంగ్

Minus Points

  • కథ,కథనం
  • నిడివి
  • డైరక్షన్
  • వీక్ క్లైమాక్స్

Bottom Line

జ‌న‌తా గ్యారేజ్ - ఈ క‌థ‌కే రిపేర్లు అవ‌స‌రం

Click Here For English Review

Tags
Share

Comments

📄Latest Reviews

సినిమా రివ్యూ: జనతా గ్యారేజ్‌
హైద‌రాబాద్‌లో స‌త్యం (మోహ‌న్‌లాల్‌) జ‌న‌తా గ్యారేజ్ అనే మెకానిక్ షెడ్డుని న‌డుపుతుంటాడు. త‌న ద‌గ్గర‌కు ఎవ‌రైనా స‌మ‌స్యంటూ వ‌స్తే... త‌న సైన్యంతో వెళ్లి ప‌రష్కరిస్తాడు. దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు. స‌త్యం త‌మ్ముడు (రెహ‌మాన్‌)ని శ‌త్రువులు చంపేస్తారు. త‌మ్ముడి వార‌సుడు ఆనంద్ (ఎన్టీఆర్‌)ని ముంబై పంపించేస్తాడు స‌త్యం. హైద‌రాబాద్‌లో పెద‌నాన్న ఉన్నార‌ని, త‌న‌కో కుటుంబం ఉంద‌ని కూడా తెలియ‌కుండానే ముంబైలో పెరిగి పెద్దవాడ‌వుతాడు ఆనంద్‌. త‌న‌కి మొక్కలంటే ప్రాణం. ప‌ర్యావ‌ర‌ణాన్నికాపాడుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతుంటాడు. మ‌ర‌ద‌లు బుజ్జి (స‌మంత‌) అంటే చాలా ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకొంటారు. మేన‌మామ (సురేష్‌) కూడా ఇద్దరికీ పెళ్లి చేయాల‌నుకొంటాడు. త‌న ప్రాజెక్ట్ ప‌ని నిమిత్తం హైద‌రాబాద్ వ‌స్తాడు ఆనంద్‌. ఇక్కడ చిన్నా (ఉన్నిముకుంద‌న్‌)తో గొడ‌వ పెట్టుకొంటాడు. చిన్నా ఎవ‌రో కాదు.... స‌త్యం త‌న‌యుడే.  అప్పుడేమైంది?   స‌త్యం, ఆనంద్ ఎప్పుడు క‌లుసుకొన్నారు?  జ‌న‌తా గ్యారేజ్ ని ఆనంద్ ముందుండి ఎలా న‌డిపించాడు?  అనేదే మిగిలిన క‌థ‌.

2.5 out of 5
Rating: 2.5
  Read Full Article

సినిమా రివ్యూ: ఆటాడుకుందాం రా

విజయ్‌ రామ్‌ (మురళీ శర్మ).. ఆనంద్‌ ప్రసాద్‌ (ఆనంద్‌) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కలసి వ్యాపారం చేస్తుంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఎక్కువ. అయితే ప్రత్యర్థులు ఆ నమ్మకంపై దెబ్బ తీస్తారు. ఆనంద్‌ ప్రసాద్‌ని అవమానించి బయటకు గెంటేస్తాడు విజయ్‌ రామ్‌. వ్యాపారంలో నష్టాలొచ్చి విజయ్‌ రామ్‌ ఆర్థికంగా చితికిపోతాడు. కొన్నేళ్లకు విజయ్‌ రామ్‌ ఇంటికి కార్తీక్‌ (సుశాంత్‌) వస్తాడు. కార్తీక్‌ విజయ్‌ రామ్‌ మేనల్లుడు. తనకు చెప్పకుండా ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని చెల్లెలంటే కోపం. అందుకే మేనల్లుడిని దూరం పెడతాడు. కార్తీక్‌ వచ్చాక విజయ్‌ రామ్‌ ఇంటి పరిస్థితులు మారతాయి. ఆగిపోతుందనుకొన్న ఆ ఇంట పెళ్లి జరిపిస్తాడు. అయితే ఆ సమయంలోనే ఓ నిజం తెలుస్తుంది. అదేంటంటే.. కార్తీక్‌ విజయ్‌ రామ్‌ మేనల్లుడు కాదు. మరి కార్తీక్‌ ఎవరు? ఆ ఇంటికి ఎందుకొచ్చాడు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆటాడుకుందాం రా’ చూడాల్సిందే.

2 out of 5
Rating: 2
  Read Full Article

సినిమా రివ్యూ: బాబు బంగారం

ఎసిపి కృష్ణ (వెంకటేష్) తన తాత లాగే అందరిపై జాలి పడే మనస్థత్త్వం ఉన్న వ్యక్తి. తను పోలీస్ ఆఫీసర్ అయినా సరే.. తను పట్టుకున్న దొంగల మీద కూడా జాలీ చూపించే అంత మంచి తనం. అలాంటి కృష్ణకు శైలజ(నయనతార) పరిచయం అవుతుంది. తొలి చూపులనే ఆమెను ఇష్టపడ్డ కృష్ణ శైలజతో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే శైలజ కుటుంబానికి ఎమ్మెల్యే పుచ్చప్ప(పోసాని కృష్ణమురళి), మల్లేష్ యాదవ్( సంపత్ రాజ్ )ల నుంచి ముప్పు ఉంటుంది. అసలు పుచ్చప్ప, మల్లేష్లతో శైలజ కుటుంబానికి ఉన్న గొడవ ఏంటి..? పుచ్చప్ప, మల్లేష్లకు కృష్ణ ఎలా బుద్ది చెప్పాడు అన్నదే మిగతా కథ.

2.5 out of 5
Rating: 2.5
  Read Full Article

Kabali

It is a story of a man and his journey from rags to riches. It is a story of Kabaleeswaran belongs to the family of daily wagers who have migrated from India to Malaysia. the oppression caused to these labourers gives birth to Kaali as a don to revolt against the atrocities.Radhika Apte plays the love interest of Kabali.The two meet fall in love and get married.Like the usual Rajni movies Rajni is a philantropist in the movie and helps in setting up schools and other centers for the underprivilidged. After certain backstabs and lashes Kabali spends 25 years of his life being imprisoned.He gets back and retains his lost life and reconciles with the present with fulfilling to get back to his daughter. The climax gives in a bolt of surprise and ends up with a non cliched twist.

3.0 out of 5
Rating: 3.0
  Read Full Article

A..Aa a family oriented story that has many flavours in it. It starts with  Anu - Anasuya Ramalingam (Samantha) committing suicide angry with her mother's decision of getting her married.Anasuya is the only daughter of rich couple Ramalingam (Naresh) and Mahalakshmi (Nadiya). She is always compromising as most of her life decisions are taken by her  overprotective and bossy mother, including her marriage. She even tries to kill herself, but that doesn’t change her mother’s mind. Her father Ramalingam on the other hand , understands and supports her, at the same time balancing the  decisions of his wife Mahalakshmi.  When her mother goes to Chennai for some work, Ramalingam secretly sends his daughter to her aunt’s house in Kaluvapudi village near Vijayawada where Anasuya meets Aanand who accompanies her on the request of his Uncle and Anu's father Ramalingam.As expected they fall  in love despite the coaxing of  a local landlord Pallam Venkanna on Anand to get married to his daughter Nagavalli .
As the movie goes by slowly the misunderstanding between the families too unfold.

4 out of 5
Rating: 4
  Read Full Article

 It is a story of a daily labourer  who works in the market yard who lives with his grandmother and falls in love with Bhagyam a girl next door.  Rayudu learns that both Bhagyam and her father are facing serious problems from a local goon called Rolex.  The hero now  takes things in handsand treats his girl's problems as his own.the story unwinds with same background and how he surpases this goon Rolex supporting Bhagyam

3 out of 5
Rating: 3
  Read Full Article