Cine Out Look

News

100 కోట్లలో 'జనతా గ్యారేజ్'..!

Published On Sep 08  2016  4:15 pm
Cine out look

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్యమేనన్ జంటగా రూపొందిన చిత్రం ‘జనతా గారేజ్’. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ళ పరంగా రికార్డులను తిరగరాస్తోంది. ఒక రకంగా ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ ఇది. తొలి 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం నిన్నటివరకు 70కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందనుకున్నారు. కానీ అనూహ్యంగా తొలి 7 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రికార్డు సాధించడం విశేషం.  బాహుబలి తర్వాత అత్యంత వేగంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది జనతా గ్యారేజ్. నిజంగా ఇది ఎవరూ ఊహించని రికార్డ్ అని చెప్పవచ్చు. 

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !