Cine Out Look

News

బుల్లి తెరపై చిరంజీవి..?

Published On Sep 08  2016  9:45 am
Cine out look

మెగా స్టార్ చిరంజీవి బుల్లి తెరపై మేరవనున్నడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతవరకు చేయని అయన తాజాగా ఓ పాపులర్ ప్రోగ్రాంకు హోస్ట్ గా చేయనున్నాడట. హిందీలో అత్యంత పాపులర్ అయిన అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన ప్రోగ్రాం 'కౌన్ బనేగా కరోడ్ పతి'కి మనవాళ్ళు మెరుగులు దిద్ది... కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో తెలుగులోను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం... నాలుగో సీజన్ కోసం ముస్తాబు అవుతోంది. తాజాగా ఇదే ప్రోగ్రాం మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని మాటీవీ ఆలోచిస్తోందట. యాంకర్ గా వ్యవహరించేందుకు మెగాస్టార్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగాస్టార్ మరో ట్రెండ్ ప్రారంభించినట్లు అవుతుంది. ఈ షో 12 డిసెంబర్ నుండి ప్రసారం కానుంది. పదేళ్ల పాటు తెరకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన 150 సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !