Cine Out Look

News

దసరా బరిలో నువ్వా నేనా..!

Published On Sep 07  2016  1:00 pm
Cine out look

పెద్ద పండుగలకు రెండు లేదా మూడు సినిమాలు అది కూడా పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటాయి. ఇక చిన్న సినిమాలు అసలు దరిదాపుల్లో కూడా ఉండవు. కానీ ఈ దసరా పండుగ మాత్రం పెద్దా చిన్న అనే తేడా లేకుండా ఒకేసారి బరిలో నిలుస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ 'ధృవ' దసరా బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీనితో మరో సినిమా ఉండదనే అనుకున్నారు. కానీ అనుకోకుండా సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ప్రకటించిన చందు మొండేటి, చైతూ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ప్రేమమ్' మళయాళ హిట్ సినిమా ఇది. నాగార్జున ఒత్తిడి మేరకు దీనిని దసరా బరిలో నిలిపారు అంటున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ ‘ఇజం’ కూడా దసరాకే రానుంది. 

ఈ మూడు సినిమాల మద్యలో కన్నడ కుర్రాడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయవుతున్న ‘జాగ్వార్’...  తెలుగు, తమిళం, హిందీ బాషలలో రానున్న అభినేత్రి రెండు డబ్బింగ్‌ సినిమాలు కూడా దసరాకే రానున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో చిన్న సినిమా కూడా వీటి మద్యలో నేను సైతం దసరా బరిలో అంటూ... ప్రకాశ్‌ రాజ్ ‘మన ఊరి రామాయాణం’ సినిమా కూడా దసరా బరిలో నిలిచింది. ఏవి హిట్ టాక్ తెచ్చుకుంటాయో వేచి చూడాలి.  

Tags
Share

Comments

🔀Telugu Updates
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !