Cine Out Look

🔀Telugu Updates
📄Latest Reviews

Aagadu Movie Review

Aaagadu has a very thin story line. Mahesh Babu is C.I in town and the town area is completely dominated by Damodar (Soonu Sood) who runs multiple illegal business. Shankar’s brother and his wife faces issues because of damodar and commits suicide. Hence shankar plans to take revenge on Damodar by playing Various tricks. In this process he meets Saroja (Tamannah) who is the M.D of Saroja sweets and falls in love with her. Publicity stunts followed by Saroja and her family in the promo of Saroja sweets is cool.   The way Shanker deals to keep damodor under his control with help of Nalla seenu, Posani, Raghu, Brahmanandam is funny. All the scenes are handled with care where in which there is a mixture of action and comedy.


3 out of 5
Rating: 3
  Read Full Article

సినిమా రివ్యూ: ఆగడు

శంకర్‌(మహేష్‌) ఒక అనాథ. చిన్నప్పుడు పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రాజారాం (రాజేంద్రప్రసాద్‌)కు శంకర్‌ తన తెలివితేటలతో సహాయం చేస్తాడు. శంకర్‌ లోని చురుకుదనం చూసి అతనిని చేరదీసి పోలీస్‌ ఆఫీసర్‌ చెయ్యాలనుకుంటాడు  రాజారం. పెరిగి పెద్దవాడైన శంకర్‌ ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అవుతాడు, అయితే కొన్ని కారణాల వల్ల రాజారాం నుంచి దూరమయిపోతాడు. 

 బుక్కపట్నంలో దామోదర్‌ (సోనూసూద్‌) చేస్తున్న అక్రమాలు అరికట్టాడానికి తన పోలీస్‌ బాస్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా వున్న శంకర్‌ని  సిఐ ని చేసి తనని ఆ ఊరికి ట్రాన్సఫర్‌ చేస్తాడు. అదే సమయంలో అక్కడ స్వీట్‌ షాప్‌ ఓనర్‌ సరోజ (తమన్నా) తో ప్రేమలో పడతాడు శంకర్‌. మరి శంకర్‌ దామోదర్‌ అరాచకాలను అరికట్టాడా? సరోజ ప్రేమను పోందాడా? అంతేకాకుండా శంకర్‌ రాజారాం నుంచి దూరమైపోవడానికి కారణాలేంటో తెలియాలంటే తెర పై చూడాల్సిందే.

3 out of 5
Rating: 3
  Read Full Article

సమీక్ష : గీతాంజలి – కామెడీ హిట్, హర్రర్ ఫట్.!

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోదామని హైదరాబాద్లోని కృష్ణా నగర్ కి రోజూ చాలా మంది వస్తుంటారు. అలా డైరెక్టర్ అయిపోయి నంది అవార్డు అందుకోవాలనే టార్గెట్ తో వచ్చిన వాడే శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి). శ్రీనివాస్ తన ఫ్రెండ్ మధు(మధునందన్) తో కలిసి ఓ ఫ్లాట్ లో దిగుతాడు. ఆ ఫ్లాట్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానివల్ల వారు రోజూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అనుకోకుండా ఓ జర్నీలో కలిసిన అంజలి(అంజలి) – శ్రీనివాస్ మంచి స్నేహితులవుతారు. రోజూ అంజలి శ్రీనివాస్ అపార్ట్ మెంట్ కి వస్తూ ఉంటుంది. కట్ చేస్తే అంజలికి ఆ అపార్ట్ మెంట్ కి ఓ సంబంధం ఉంటుంది. అసలు అపార్ట్ మెంట్ కి అంజలికి ఉన్న సంబంధం ఏమిటి? అంజలి కావాలనే శ్రీనివాస్ తో పరిచయం పెంచుకుందా? శ్రీనివాస్ రోజూ ఇబ్బందులు ఎదుర్కోవడానికి వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరుగుతోంది? అలాగే డైరెక్టర్ అవ్వాలని వచ్చిన శ్రీనివాస్ చివరికి డైరెక్టర్ అయ్యాడా? లేదా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి..

2 out of 5
Rating: 2
  Read Full Article

సినిమారివ్యూ: పవర్

కథ కొలకొత్తాలో మొదలవుతుంది. అక్కడ ఏసీపీ బల్దేవ్ (రవితేజ).. మహా అవినీతి ఆఫీసర్. చేస్తున్న అవినీతిలో వాటా ఇస్తే సరే.. లేదంటే వేటే!  ఈ టైపు క్యారెక్టర్. కొలకొత్తాలో అరాచకాలు సృష్టిస్తున్న గంగూలీ ని పట్టుకొని పోలీసులు కోర్టుకు అప్పగించాలనుకొంటే.. ఏసీపీ బల్దేవ్ అతన్ని ఎత్తుకొచ్చేస్తాడు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఏసీపీ చనిపోతాడు. గంగూలీ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. తన డిపార్ట్మెంట్ లోని పోలీస్ ఇలా అవినీతికి పాల్పడడంతో నైతిక బాధ్యత వహించిన హోం మినిస్టర్ (ముఖేష్ రుషి ) తన పదవికి రాజీనామా చేయాలనుకొంటాడు. 

అదే సమయంలో సరిగ్గా.. బల్దేవ్ పోలీకలతోనే మరొకడు హైదరాబాద్లో ఉన్నాడన్న సంగతి తెలుస్తుంది. అతనెవరో కాదు.. తిరుపతి (రవితేజ). తనకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది కల. కానీ... బావ (బ్రహ్మానందం) అడ్డుకొంటుంటాడు. తిరుపతిని తీసుకొచ్చి బల్దేవ్ స్థానంలో నియమించి,     తన ద్వారా గంగూలీని పట్టుకోవాలని హోం మినిస్టర్ పథకం రచిస్తాడు. పోలీస్ ఆఫీసర్ అనగానే ఎగిరి గంతేసి... కొలకొత్తా వెళ్లిపోతాడు తిరుపతి. అక్కడ ఏసీపీగా ఛార్జ్ తీసుకొని గంగూలీని   పట్టుకొంటాడు. 

అయితే అసలు ట్విస్టు అప్పుడే తెలుస్తుంది. అదేంటో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. బల్దేవ్ స్థానంలోకి వెళ్లిన తిరుపతికి తెలిసిన నిజం ఏమిటి?  అసలు బల్దేవ్ ఎవరు? అతని కథేంటి?  తెలుసుకోవాలంటే పవర్ చూడాలి.

2.75/5 out of 5
Rating: 2.75/5
  Read Full Article

సమీక్ష : రన్ రాజా రన్ – రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.!

రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శర్వానంద్) ఎప్పుడూ నిజాలే మాట్లాడడం వలన ప్రతి అమ్మాయితోనూ బ్రేకప్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రియ(సీరత్ కపూర్) ఎవరికన్నా ప్రపోజ్ చెయ్యాలి అనుకుంటే అనుకోకుండా వాళ్ళకి పెళ్ళై పోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అనుకోకుండా కలిసుకొని ముందు ఫ్రెండ్స్ అయ్యి, ఆ తర్వాత లవర్స్ అవుతారు. కట్ చేస్తే ప్రియ వాళ్ళ నాన్న దిలీప్ కుమార్(సంపత్) సిటీ పోలీస్ కమీషనర్ అని తెలుస్తుంది. దాంతో దిలీప్ కుమార్ తమ పెళ్ళికి ఒప్పుకోడని రాజా ఫిక్స్ అవుతాడు. కానీ ఓ మెలిక పెట్టి దిలీప్ కుమార్ రాజా – ప్రియ పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఈ స్టొరీ పక్కన పెడితే సిటీలో ఓ కిడ్నాప్ గ్రూప్ ప్రముఖులను కిడ్నాప్ చేస్తూ డబ్బులు రికవర్ చేస్తుంటారు. ఆ గ్రూప్ ని పట్టుకోవడం కోసమే దిలీప్ కుమార్ సిటీకి వస్తాడు. చివరికి దిలీప్ కుమార్ ఆ కిడ్నాప్ ముఠాని పట్టుకోగలిగాడా? లేదా? అసలు రాజా పెళ్ళికి దిలీప్ కుమార్ పెట్టిన మెలిక ఏమిటి? ఆ మెలికకి కిడ్నాప్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? అనేది మీరు తెరమీదే చూడాలి

3.25/5 out of 5
Rating: 3.25/5
  Read Full Article

సమీక్ష : రభస – మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే రభస.!

కార్తీక్(ఎన్.టి.ఆర్) యుఎస్ లో తన గ్రాడ్యువేషన్ పూర్తి చేసికొని ఇండియాకి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన కార్తీక్ కి తన తల్లి తండ్రులైన నాజర్ – జయసుధలు పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడే జయసుధ తన కుటుంబం నుంచి వేరుగా వెళ్ళిపోయిన తన అన్నయ్య ధనంజయలు(సాయాజీ షిండే) కుమార్తె చిట్టి అలియాస్ ఇందు(సమంత)ని తన ఇంటి కోడలిగా తీసుకురమ్మని కార్తీక్ ని కోరుతుంది. ఆ పనిమీద కార్తీక్ ఇందు చవివే కాలేజ్ కి వెళతాడు. అక్కడ అనుకోకుండా భాగ్యం(ప్రణిత) కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. అన్ని తప్పించుకొని ఫైనల్ గా కార్తీక్ ఇందుని దక్కించుకునే ప్రయత్నంలో ఉండగా పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలు కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. అసలు ఈ పెద్ది రెడ్డి, గంగి రెడ్డి ఎవరు? అసలు కార్తీక్ కి పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలకి ఉన్న సంబంధం ఏమిటి.? కార్తీక్ ఇందుల మధ్య భాగ్యం ఎలా ఎంటర్ అయ్యింది? చివరికి కార్తీక్ తన అమ్మ కోరినట్టుగా ఇందుని పెళ్లి చేసుకున్నాడా.? లేదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

3/5 out of 5
Rating: 3/5
  Read Full Article
📷SUBSCRIBE TO OUR MAILING LIST

Your e-mail will be secure with us. We will not share your information with anyone !